దసరా మూవీలో నానికి స్నేహితుడిగా నటించిన కన్నడ యంగ్ హీరో దీక్షిత్ శెట్టి. సూరీ పాత్రలో నానికి దీటుగా నటించి ఔరా అనిపించుకున్న దీక్షిత్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద సైమా అవార్డు కూడా అందుకున్నారు. అయితే ప్రస్తుతం ఏకంగా ఏడు సినిమాలకు సంతకం చేసి ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగు, తమిళంలో కూడా నటిస్తున్నాడు. అయితే తెలుగులో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో రష్మికాకు బాయ్ ఫ్రెండ్‌గా కనిపించనున్నాడు.