డబ్ల్యూపీఎల్‌లో భాగంగా గుజరాత్‌లోని వడోదర వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై బెంగళూరు మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 142 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ స్మృతి మంధాన 81 పరుగులతో అదరగొట్టింది. మరో ఓపెనర్ డానియెల్లెకు (42), ఎల్లిసి (7*), రిచా (11*) పరుగులు చేశారు. ఢిల్లీబౌలర్లలో అరుంధతి రెడ్డి, శిఖా పాండే చెరో వికెట్ తీశారు.