TG: నేడు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనుంది. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బీసీ బిల్లును.. పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాకు పిలుపునిచ్చింది. ఇందులో బాగంగా ఈ ధర్నాలో పాల్గొనేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.