హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రిట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి దృష్టికి సీఎం రేవంత్ తెచ్చారు. హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించే 2,800 బస్సులను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ మోడల్ కింద కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, పొన్నం, పొంగులేటి, ఎంపీలు తదితరులు ఉన్నారు.