MBNR ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

73చూసినవారు
MBNR ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను లెక్కిస్తున్నారు. సాయంత్రానికి ఫలితం తేలే అవకాశం ఉంది. మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్