తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

68చూసినవారు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి వెలుపల టీబీసీ భవనం వరకు వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 67,223 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,549 మంది తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్