రాష్ట్రంలో మహిళలు ఫ్రీ బస్సు ప్రయాణం కేవలం జిల్లాల వరకు మాత్రమేనని మంత్రి సంధ్యారాణి అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా, దాటాక బోడ మల్లన్నలా ప్రభుత్వ తీరు ఉందని షర్మిల ఆరోపించారు. జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసం అన్నారు. చేయాలన్న చిత్తశుద్ది లేక చెప్పే సాకులు అని షర్మిల ధ్వజమెత్తారు.