AP: తనను త్వరలోనే అరెస్ట్ చేసి జైలులో పెడతారంటూ నటి శ్రీరెడ్డి గతంలో మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను ఈ రోజు కాకుంటే రేపు అయినా అరెస్టు చేసి జైల్లో వేస్తారని.. అప్పుడు తాను వైసీపీ పిల్లని కాదని వైసీపీ నేతలు చేతులెత్తేస్తారని ఆ వీడియోలో శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం వైసీపీ గురించి ఎవరైనా పాజిటివ్ పోస్ట్ పెడితే వారిని అంతుచూస్తున్నారని అందులో ఆమె ఆరోపించారు.