మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం గౌరవ్ నామ్‌దేవ్ అనే వ్యక్తి తన తండ్రితో కలిసి బ్యాంక్‌కు వెళ్లి, రూ.50,000 డ్రా చేశాడు. తండ్రితో కలిసి బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. దీంతో వారిని అనుసరించిన దొంగ, ఆ వ్యక్తి జేబులో ఉన్న రూ.50 వేలు చోరీ చేశాడు. తన అనుచరుడితో కలిసి మరో బైక్‌పై పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.