AP: ఏలూరు జిల్లాలోని దారుణ ఘటన చోటుచేసుకుంది. జీలుగుమిల్లి (M) తాటాకులగూడెంలో వైసీపీ కార్యకర్త గంధం బోసుబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ హత్యకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదని, వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. బోసుబాబు భార్య శాంతికుమారి తనకు మేనమామ వరుసైన సోంగా గోపాలరావుతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.