గత సీజన్ వరకు లఖ్నవూ సూపర్ జెయింట్స్‌ను కేఎల్ రాహుల్ నడిపించాడు. ఈసారి అతడు ఢిల్లీకి మారిపోయాడు. ఇక రిషభ్ పంత్ డీసీకి సారథిగా వ్యవహరించాడు. ఇప్పుడు మాత్రం ఢిల్లీకి కేఎల్ రాహుల్ వెళ్లిపోయాడు. అక్కడ బ్యాటర్‌గానే కొనసాగుతాడు. ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు అక్షర్ పటేల్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక లఖ్నవూ సారథిగా రిషభ్ పంత్‌ను గత మెగా వేలంలో రూ.27 కోట్లకు LSG సొంతం చేసుకుంది.