AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అద్భుతాలను సృష్టిస్తోంది. ఇటీవల జరిగిన ఒక వివాహంలో AI రూపొందించిన ఓ వీడియో అందరినీ కంటతడి పెట్టించింది. ఇటీవల జరిగిన ఒక వివాహంలో, మరణించిన వరుడి సోదరుడు వేడుకకు వచ్చినట్లు ఎడిట్ చేశారు. వరుడు కాల్ చేయగానే స్వర్గం నుంచి కిందకి వచ్చి కుటుంబంతో కలిసి పెళ్లిలో ఉన్నట్లు, భోజనం చేసి ఆశీర్వదించి వెళ్లిపోయినట్లు వీడియో ఎడిట్ చేసి చూపించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులందరూ కన్నీటి పర్యంతమయ్యారు.