'మే 27న సెలవు ప్రకటించండి'

19190చూసినవారు
'మే 27న సెలవు ప్రకటించండి'
ఈనెల 27న నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈసీని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఓటేసేలా, ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై వికాస్ రాజ్ సానుకూలంగా స్పందించారని వెంకట్ తెలిపారు.

సంబంధిత పోస్ట్