వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను ఒక శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ వార్షిక సాయాన్ని రూ.6000 నుంచి రూ.12000 పెంచాలని కోరారు. పీఎం ఫసల్ బీమా యోజన కింద సన్నకారు రైతులకు జీరో ప్రీమియంతో ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రీబడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో విన్నవించారు. పురుగుమందులపై GSTని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని PHD ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతిపాదించింది.