రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది: RSP

77చూసినవారు
రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది: RSP
తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందని BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 'రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ రేవంత్ ధ్వంసం చేస్తున్నారు. ప్రజల హక్కులను సీఎం రేవంత్ హరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీసింది. బీఆర్ఎస్ సభ లోపలా, బయటా గణాంకాలతో సహా రేవంత్ తీరును ఎండగట్టింది. BRS ప్రధాన ప్రతిపక్షంగా పోరాడటాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్