కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు అటు తమిళం, తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాడు. అయితే తాజాగా విక్రమ్ నటించిన మూవీ 'వీరా ధీర శూరన్'. ఈ మార్చి 27న విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో పదేళ్ల తర్వాత విక్రమ్ ఖాతాలో విజయం నమోదైంది. ఎంపురాన్ సినిమాను తొలగించి మరికొన్ని ప్రదేశాల్లో విక్రమ్ సినిమాను ప్రదర్శిస్తున్నారు.