AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జంగా బుజ్జి అనే వ్యక్తి.. తన అల్లుడు హేమంత్ కోసం 666 వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. 40 మందితో ఆహార పదార్థాలను తయారు చేయించారు. జర్మనీ నుంచి పండుగ కోసం వచ్చిన అతనికి అత్తారింట్లో తొలి సంక్రాంతి ఎప్పటికీ గుర్తుండిపోవాలని సర్ ప్రైజ్ చేశారు. కోనసీమ స్పెషల్స్, నేచురల్ ఫుడ్స్, డ్రింక్తో పాటు ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలనూ తెప్పించారు.