గుడ్డులో పచ్చసోన తినకుండా పారేస్తున్నారా?

60చూసినవారు
గుడ్డులో పచ్చసోన తినకుండా పారేస్తున్నారా?
ప్రతి రోజూ ఒక గుడ్డును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే కొంతమంది గుడ్డులోని పచ్చసోనలో ఎక్కువ కొవ్వు ఉంటుందని తినకుండా వదిలేస్తుంటారు. కానీ, పచ్చసోనలో ఉండే 186మి.గ్రా. కొలెస్ట్రాల్ మనకు అంత హానీకరమేమి కాదని వైద్యులు చెబుతున్నారు. పైగా పచ్చసొనను తినకపోవడం వల్ల ముఖ్య పోషకాలైన కొలైన్, సెలీనియం, జింక్‌, విటమిన్ ఎ, బి, ఇ, డి, కె కూడా కోల్పోతారు. పచ్చసొనలో ఐరన్ శాతం కూడా అధికంగా ఉంటుంది.

సంబంధిత పోస్ట్