తిరుపతిలో వ్యక్తిపై చిరుతపులి దాడి

68చూసినవారు
తిరుపతిలో వ్యక్తిపై చిరుతపులి దాడి
తిరుపతిలో ఓ వ్యక్తిపై చిరుతపులి దాడి చేసింది. తిరుపతిలోని సైన్స్ సెంటర్ దగ్గర బైకుపై వెళ్తున్న మునికుమార్ అనే వ్యక్తిపై పట్ట పగలే చిరుత దాడి చేసి గాయపరిచింది. గాయపడిన మునికుమార్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు. చిరుత దాడిలో కేవలం గాయాలు మాత్రమే అయ్యాయి. అతడి ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్