ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరుగనున్నది. అన్ని మ్యాచులు ఒక ఎత్తయితే.. ఈ మ్యాచ్ లెక్క వేరు. ఈ క్రమంలో మ్యాచ్‌కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 300 కంటే ఎక్కువ పరుగులు చేస్తేనే విజయ అవకాశాలుంటాయని తెలిపాడు. ఏ జట్టు మిడిలార్డర్ రాణిస్తే ఆ జట్టు గెలిచే ఛాన్స్ అధికంగా ఉంటుందని పేర్కొన్నాడు.