టన్నెల్‌ ప్రమాదం.. సొరంగంలో బయటపడ్డ కార్మికుడి చెయ్యి

82చూసినవారు
టన్నెల్‌ ప్రమాదం.. సొరంగంలో బయటపడ్డ కార్మికుడి చెయ్యి
TG: శ్రీశైలం ఎడమ గట్టు కలువ(SLBC) టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారి ఆచూకీని సహాయక బృందాలు కనుగొన్నాయి. టన్నెల్‌లో 14వ కి.మీ వద్ద మట్టి దిబ్బల్లో ఓ కార్మికుడి చేయి బయటపడినట్లు సమాచారం. దీంతో లోపల చిక్కుకుపోయిన 8 మందిలో ఎంత మంది ప్రాణాలతో ఉన్నారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా బురదలో కూరుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్