ఉమ్మడి ఏపీ ఎత్తిపోతల పథకం సృష్టికర్త గురించి మీకు తెలుసా.?

53చూసినవారు
ఉమ్మడి ఏపీ ఎత్తిపోతల పథకం సృష్టికర్త గురించి మీకు తెలుసా.?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగు నీరు అందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఘంటా గోపాల్‌రెడ్డి అనే వ్యవసాయ శాస్త్రవేత్త నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ తవ్వకాల సమయంలో కాలువకు ఎగువ భాగంలోని బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు సుదీర్ఘంగా పోరాడారు.1969 ఏడాదిలో 'మహాత్మాగాంధీ ఎత్తిపోతల' నిర్మాణానికి అయన కృషి చేశారు. ఈ పథకాన్ని ఏర్పాటు చేసి రైతుల బీడు భూముల్లో పంట సిరులు కురిపించేలా చేశారు. ఈ నిర్మాణంతో ఉమ్మడి ఏపీలో ఎత్తిపోతల సృష్టికర్తగా గోపాల్ రెడ్డి మన్ననలు అందుకున్నాడు. నేడు ఎత్తిపోతల సృష్టికర్త గోపాల్ రెడ్డి జయంతి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్