ఫిబ్రవరి నెలలో GST వసూళ్లు ఎన్ని కోట్లో తెలుసా?

56చూసినవారు
ఫిబ్రవరి నెలలో GST వసూళ్లు ఎన్ని కోట్లో తెలుసా?
దేశంలో వస్తువులు, సేవల పన్ను వసూళ్లు మరోసారి భారీ పెరుగుదలను నమోదు చేశాయి. ఫిబ్రవరి నెలలో ఈ వసూళ్లు రూ.1.84 లక్షల కోట్లుగా కేంద్రం వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లలో 9.1 శాతం పెరుగుదల ఉందని కేంద్రం పేర్కొంది.జీఎస్టీ ఆదాయంలో దేశీయ ఆదాయ వసూళ్లు 10.2 శాతం పెరిగి రూ.1.42 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 5.4 శాతం పెరిగి రూ.41,702 కోట్లకు చేరుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్