హిమాచల్‌ప్రదేశ్‌లో వాతావరణ మార్పుల కారణంగా భారీగా మంచు, వర్షం కురుస్తోంది. శుక్రవారం కొండచరియలు విరిగిపడి కీలక రహదారులు, జాతీయ రహదారులు మూతపడ్డాయి. ఈ మేరకు విద్యాసంస్థలు మూతపడ్డాయి. చంబా, కులు, మనాలిలో కళాశాలలు సహా అన్ని విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే CBSE బోర్డు పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని వెల్లడించారు. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.