ఢిల్లీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరినాటికి పబ్లిక్ సీఎన్‌జీ బస్సుల్లో 90 శాతం బస్సులను తొలగిస్తామని పేర్కొంది అలాగే వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని అధికారులు వెల్లడించారు. కాగా, ఇటీవల వల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపాలై.. బీజేపీ విజయ సాధించిన విషయం తెలిసిందే.