ముస్లీంలు రంజాన్ పండుగకు ముందు రోజు రాత్రి నెలవంక కనిపించిన తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అప్పటితో ఉపవాస దీక్షలు ముగుస్తాయి. ఈద్( పండుగ ) రోజు ఉపవాసం ఉండకూడదని ఖురాన్ చెబుతోంది. ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) నమాజ్ కంటే ముందు ' జకాత్ ' చెల్లిస్తారు. ఇస్లాం 5 మూల స్తంభాల్లో జకాత్ 4వది. పండుగ రోజున నమాజ్‌కు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా. అందుకే ఈ పండుగకు ఈద్ ఉల్ ఫితర్ అని పేరు వచ్చింది.