నేటి కాలంలో చాలా మంది బెడ్స్‌పై పడుకుంటారు. కానీ, నేలపై పడుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేలపై పడుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల కండరాలకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. వెన్నునొప్పి, భుజం నొప్పి, మెడ నొప్పి మొదలైన సమస్యలు దూరమవుతాయి. అలాగే నేలపై పడుకున్నప్పుడు శరీర బరువు సమానంగా ఉంటుంది. దీంతో మెదడుకు ప్రశాంతత లభించి, ఒత్తిడి తగ్గుతుంది.