ప్రముఖ బిలియనీర్ల విద్యార్హతల గురించి ఎవరికైనా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు 'బెర్నార్డ్ ఆర్నాల్ట్' పారిస్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్ నుండి ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. ఇక 'ఎలొన్ మస్క్' పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్, ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. అమెజాన్ CEO 'జెఫ్ బెజోస్' ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. 'లారీ ఎల్లిసన్' చికాగో యూనివర్సిటీలో మధ్యలోనే చదువుని ఆపేశాడు. 'జూకర్ బర్గ్' హార్వార్డ్ యూనివర్సిటీ నుండి డ్రాపౌట్‌గా ఉన్నారు.