గ్యాస్ సిలిండర్‌ను తయారు చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎల్‌పీజీకి వాసన ఉండదు. దీనికి మండే స్వభావం ఉంటుంది. వాసన లేకపోతే ఎల్‌పీజీ లీక్ అవుతుందా? లేదా? అని గుర్తించడం కష్టం అవుతుంది. దీంతో ప్రమాదాలు కూడా జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రమాదాలను నివారించడానికి ఇందులో ఇథైల్ మోర్కాంప్టన్ కలిపి వాసన వచ్చేలా చేస్తారు. ఒకవేళ గ్యాస్ లీకైతే వెంటనే వాసన వస్తుంది. దీని వల్ల ప్రమాదం జరుగకుండా జాగ్రత్త పడవచ్చు.