పన్నేండ్లకే పుష్కరాలు ఎందుకు వస్తాయో తెలుసా?

50చూసినవారు
పన్నేండ్లకే పుష్కరాలు ఎందుకు వస్తాయో తెలుసా?
పురాణాల ప్రకారం పుష్కరుడు అనే బ్రాహ్మణుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి, జీవుల పాపాలతో అపవిత్రమైన నదులు తన స్పర్శతో పునీతమయ్యే వరం కావాలని కోరుకుంటాడు. తపస్సు మెచ్చిన పరమేశ్వరుడు పుష్కరుడికి 12 ఏళ్లకు 12 నదుల్లో ఏడాదికి ఓ నది చొప్పున ఏ నదిలోకి ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని వరమిచ్చారు. ఈ వరంలో భాగం కావాలని దేవగురువు బృహస్పతి అడగడంతో.. బృహస్పతి రాశిమారినప్పుడే పుష్కరుడు ఆ నదిలోకి ప్రవేశిస్తాడు.

సంబంధిత పోస్ట్