‘జై షాకు బ్యాట్‌ పట్టుకోవడం తెలుసా..?’

66చూసినవారు
‘జై షాకు బ్యాట్‌ పట్టుకోవడం తెలుసా..?’
క్రికెట్‌ ఎలా ఆడాలో తెలియకుండానే బీజేపీ అగ్రనేత అమిత్‌ షా కుమారుడు జై షా బీసీసీఐలో ఉన్నత స్థానంలో ఉన్నారంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌ సింగ్ విమర్శించారు. ‘‘బ్యాట్‌ పట్టుకోవడం రాని జై షా ఇప్పుడు బీసీసీఐలో చక్రం తిప్పుతున్నారు. ప్రధాని మోదీ 73 ఏళ్ల వయసులో మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చోవాలని ఆశిస్తున్నారు. కానీ జవాన్లకు మాత్రం వయసు పరిమితిని 21 ఏళ్లకు కుదించారు. ఈ వ్యక్తులు ఘోరమైన పరివారవాదీలు’’ అంటూ విమర్శలు చేశారు.

సంబంధిత పోస్ట్