చక్కెర వ్యాధికి చుక్కల మందు

70చూసినవారు
చక్కెర వ్యాధికి చుక్కల మందు
మధుమేహానికి గురైతే ఇన్సులిన్‌ ఇంజక్షన్లు గుచ్చుకుంటూనే ఉం డాలి. ఆ బాధ చెప్పుకోలేనిది. ఇంజెక్షన్ల సమస్యకు చెక్‌ పెట్టేందుకు శాస్త్రవేత్తలు చుక్కల మందును అభివృద్ధి చేశారు. ఈ చుక్కలను నాలుక కింద వేసుకొంటే సరి.. ఇంజెక్షన్లు అవసరమే లేదు. యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా శాస్త్రవేత్తలు.. ‘ఓరల్‌ ఇన్సులిన్‌’ డ్రాప్స్‌ను తయారుచేశారు. ఈ చుక్కలను నాలుక కింద వేసుకొంటే చాలు.. అవి రక్తంలో కలిసి గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రణలో ఉంచుతాయని పరిశోధకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్