ఎన్నికల ఎఫెక్ట్.. ఆర్టీసీకి భారీగా ఆదాయం

50చూసినవారు
ఎన్నికల ఎఫెక్ట్.. ఆర్టీసీకి భారీగా ఆదాయం
సార్వత్రిక ఎన్నికలు టీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించాయి. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ 3500కు పైగా బస్సులను నడిపింది. ఆరోజు కేవలం 23 గంటల్లో ఆర్టీసీకి రూ.24.22 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. సుమారు రూ.15కోట్లు టికెట్ల అమ్మకాల ద్వారా రాగా మిగిలిన రూ.9 కోట్లు ఉచిత ప్రయాణానికి సంబంధించినవని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వనుంది.

సంబంధిత పోస్ట్