ఇంట్లోకి దూరి రచ్చ చేసిన ఏనుగు (వీడియో)

51చూసినవారు
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా తేర్కుపాళయం ప్రాంతంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఏనుగు ఇంట్లోకి ప్రవేశించి నానా బీభత్సం సృష్టించింది. కొంతమంది వలస కార్మికులు ఆ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు. శనివారం రాత్రి వారు పని ముగించుకుని వచ్చిన తర్వాత వంట చేస్తున్నారు. అదే సమయంలో అకస్మాత్తుగా ఓ మగ ఏనుగు వారి ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడ వండిన అన్నాన్ని కింద పడేసి తినేసింది. అలాగే ఇతర వస్తువులను చిందరవందర చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్