విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాల విద్యార్థి అటుకూరి సాయిమణిదీప్(24) బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్ లో తాను ఉంటున్న గదిలోనే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోన్న మణిదీప్ పరీక్ష తప్పడంతో ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.