యూపీలోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్వామిజీల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గుడారాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.