అమెరికాలోని హవాయి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ క్రమంలో లావా 100 అడుగులకు పైగా ఎగిసిపడుతోంది. అయితే గతేడాది డిసెంబర్‌లోనే కిలోవియా శిఖరంపై బిలం నుంచి విస్ఫోటం మొదలైనట్లు అధికారులు తెలిపిన సంగతి విధితమే. అయితే ఇది 150 నుంచి 165 అడుగుల వరకు ఎగసి పడే అవకాశం ఉందని అగ్నిపర్వత అబ్జర్వేటరీ పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.