శిరీష హత్య కేసు.. ఆడపడుచే చంపింది

72చూసినవారు
శిరీష హత్య కేసు.. ఆడపడుచే చంపింది
TG: హైదరాబాద్‌ మలక్‌పేటలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. శిరీషను ఆమె ఆడపడుచు (భర్త సోదరి) హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శిరీషకు మత్తుమందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు. హత్య విషయం తెలిసినా దాన్ని బయటపెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని భర్త వినయ్‌ మాయం చేయాలనుకున్నట్లు గుర్తించారు. వినయ్, అతడి సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్