AP: డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కోరిక మేరకు తొలుత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. తీరా శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితేనే బాగుంటుందని పవన్ అభిప్రాయపడినట్లు సమాచారం.