ప్రధాని నరేంద్ర మోదీకి తమిళం అంటే అపారమైన ప్రేమ అని బీజేపీ చెబుతుందని, అదే నిజమైతే ఆయన చేతల్లో అది ఎందుకు కనిపించడం లేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రశ్నించారు. సెంగోల్‌కు పార్లమెంటులో చోటు కల్పించే బదులు తమిళనాడులోని కేంద్ర కార్యాలయాల్లో హిందీకి చోటే లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పారు. హిందీకి బదులు తమిళాన్ని అధికారిక భాషగా ప్రకటించి మరిన్ని నిధులు విడుదల చేయాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.