ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని సోమవారం తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోస్టుమార్టం ముగిసిన తర్వాత రేపటి వరకు మృతదేహాలను భద్రపర్చాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.