కొందరు ఇబ్బంది పడినా.. కఠిన నిర్ణయాలు తప్పవు: హైడ్రా రంగనాథ్‌

52చూసినవారు
కొందరు ఇబ్బంది పడినా.. కఠిన నిర్ణయాలు తప్పవు: హైడ్రా రంగనాథ్‌
నగరంలో చెరువుల సంరక్షణ కోసం కొందరు ఇబ్బందిపడినా.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగిన జియో స్మార్ట్‌ ఇండియా రెండో సదస్సులో ఆయన మాట్లాడారు. జియో సైన్స్‌ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని.. శాటిలైట్ మ్యాప్ డేటా బేస్ ద్వారా చెరువులను గుర్తించి హైడ్రా వాటిని కాపాడుతుందని రంగనాథ్‌ తెలిపారు. మ్యాప్ ద్వారా ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నామని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్