సికింద్రాబాద్‌లోని హాకీ గ్రౌండ్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై మాట్లాడుతూ.. "ప్రతి ఒక్కడు 'బుల్డోజర్ నా మీద నుంచి పోనియండి' అంటున్నారు. ఎంతమంది కోసం ఎన్ని బుల్డోజర్లు కొనాలి. హరీష్, కేటీఆర్, రాజేందర్ తోపాటు నెత్తి మీద జుట్టు లేని వాళ్లు కూడా బుల్డోజర్ నా మీద నుంచి పోనియండి అంటున్నారు. మీకోసం బుల్డోజర్ అవసరమా దారిన పోయే పిచ్చికుక్క కరిచినా చస్తారు" అని విమర్శించారు.