'దృశ్యం' సినిమా స్ఫూర్తితో గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ వ్యాపారవేత్తను ఢిల్లీ మాజీ పోలీసు కానిస్టేబుల్ హత్య చేశాడని గ్రేటర్ నోయిడా డీసీపీ ఎస్ఎం ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఓ ఫ్లాట్ కొనుగోలు విషయంలో వివాదం తలెత్తి ఈ హత్య చేసినట్లు వెల్లడించారు. ఈ హత్యకు ముందు నిందితుడు 'దృశ్యం' సినిమాతో పాటు ఇతర క్రైమ్ వెబ్ సిరీస్ లను చూసి ప్లాన్ చేశాడని తెలిపారు. ప్లాన్ లో బాగంగా వ్యాపారిని సుత్తితో కొట్టి చంపి వివాదాస్పద ప్రాపర్టీలోనే మృతదేహాన్ని దాచిపెట్టాడు.