కాళేశ్వరం ఇంజినీర్లను విచారిస్తున్నాం: జస్టిస్‌ ఘోష్‌

62చూసినవారు
కాళేశ్వరం ఇంజినీర్లను విచారిస్తున్నాం: జస్టిస్‌ ఘోష్‌
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ విచారణ కొనసాగుతుంది. ఆ సందర్భంగా ఘోష్ మాట్లాడుతూ.. '3 ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజినీర్లను విచారిస్తున్నాం. అఫిడవిట్‌ ద్వారా అన్ని విషయాలు తెలపాలని ఆదేశించాం. ఇంజినీర్లందరూ జూన్‌ 25లోపు నివేదిక ఇవ్వాలని చెప్పాం. అఫిడవిట్‌ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డు అవుతాయి. బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్లు కనిపిస్తోంది. లోపం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలుస్తాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్