తోపుడు బండిలో పేలిన సిలిండర్.. తప్పిన ప్రాణనష్టం (Video)

64చూసినవారు
తమిళనాడులోని తిరునల్వేలీలో భారీ ప్రాణ నష్టం తప్పింది. పట్టణంలోని నార్త్‌ కార్‌ స్ట్రీట్‌లో ఓ తోపుడు బండిలో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో అక్కడ పనిచేస్తున్న వ్యక్తితోపాటు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్దంతో సిలిండర్‌ పేలిపోవడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. పేలుడు ధాటికి ఆ తోపుడుబండి తునాతునకలైంది. భారీగా మంటలు చెలరేగడంతో రెండు దుకాణాలు కాలి బూడిదైపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతున్నది.

సంబంధిత పోస్ట్