పేలిన గ్యాస్ సిలిండర్‌.. తృటిలో తప్పించుకున్న బాలిక (వీడియో)

85చూసినవారు
ఒక ఇంట్లో సంభవించిన గ్యాస్ సిలిండర్‌ పేలుడు ప్రమాదం నుంచి ఓ బాలిక తృటిలో తప్పించుకున్నది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం షహబాద్ డెయిరీ ప్రాంతంలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి రేకులు, పలు వస్తువులు ఎగిరిపడ్డాయి. అయితే ఈ పెలుడుకు కొన్ని క్షణాల ముందే ఆ బాలిక అక్కడి నుంచి నడిచి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్