చలికాలంలో బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చల్లటి వాతావరణంలో బొప్పాయి తినడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. డెంగీ పేషెంట్లకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. లివర్ సమస్యలు, యాసిడ్ రిఫ్లెక్స్‌ను నివారిస్తుంది. ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. డెంగీ బాధితులు బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే ప్లేట్‌లెట్స్ సంఖ్య ఇట్టే పెరుగుతుంది.