నకిలీ పాస్‌పోర్టు కేసు.. లుకౌట్ నోటీస్ జారీచేసిన సీఐడీ

68చూసినవారు
నకిలీ పాస్‌పోర్టు కేసు.. లుకౌట్ నోటీస్ జారీచేసిన సీఐడీ
తెలంగాణలో సంచలనం సృష్టించిన నకిలీ పాస్‌పోర్టు కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫేక్ పాస్‌పోర్టుతో 92 మంది దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వారి పాస్‌పోర్టులను రద్దు చేయాలని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీస్‌కు సీఐడీ లేఖ రాసింది. ఈ కుంభకోణంలో ఏజెంట్లు, పాస్‌పోర్టు, ఎస్‌బీ సిబ్బంది కుమ్మక్కయినట్టు అనుమానిస్తున్నారు. జగిత్యాల, ఫలక్‌నుమా అడ్రస్ తో నకిలీ పాస్‌పోర్టులు ఎక్కువగా పొందినట్లు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్