అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో కేరళలోని ఓ అల్లు అర్జున్ అభిమాని వినూత్నంగా తన అభిమానాన్ని ప్రదర్శించాడు. సినిమాలో అల్లు అర్జున్ వేసిన ‘గంగమ్మ తల్లి’ అవతారంలో థియేటర్లో సందడి చేశాడు. పొట్టపై అల్లు అర్జున్ బొమ్మను వేసుకొని డాన్స్ అదరగొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.